Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ ఉద్యోగాలకు కటాఫ్ మార్కులు తగ్గింపు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (14:15 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. పోలీస్ ఉద్యోగ నియామకాల కోసం కటాఫ్ మార్కులను తగ్గించింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ పోలీస్‌ నియామక మండలి కటాఫ్‌ మార్కులపై జీవోను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఓసీ అభ్యర్థులకు 30 శాతం, బీసీ అభ్యర్థులకు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 20 శాతం మార్కులను కేటాయిస్తున్నట్టు తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటీసు ద్వారా వెల్లడించింది.
 
దీనిప్రకారం.. 200 మార్కులకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 60 మార్కులు, బీసీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. 
 
శారీరధారుడ్య పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్‌ మార్కులు 30 శాతంగా, బీసీలకు 35 శాతంగా, ఓసీలకు 40 శాతంగా ఉండేవి. కానీ, ఈసారి సామాజికవర్గాలతో సంబంధం లేకుండా అందరికీ 30 శాతం మార్కులను అర్హతగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
అంటే పరీక్షలో 200 ప్రశ్నలకు 60 మార్కులు వస్తే సరిపోతుంది. మళ్లీ ఇందులో నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. దీని ప్రకారం ఓసీలకు 10 శాతం, బీసీలకు 5 శాతం సడలింపు ఇచ్చినట్టయింది. తమకు ఎలాంటి సడలింపు ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో ప్రభుత్వం స్పందించి జీవోను సవరించింది. 

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments