Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనిక రాష్ట్రం ఖజానా ఖాళీ... తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్!

దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బ

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (10:56 IST)
దేశంలో రెండో ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడానికి వీల్లేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీనికి కారణం ఆ రాష్ట్ర ఖజానాలో పైసా లేదట. అందుకే చెక్కులను బౌన్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు చెల్లలేదని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేవిలా ఉన్నాయి. దీనిపై వివరణ ఇస్తూ, కొత్త జిల్లాలు ఏర్పడిన వేళ, చెక్కులను చెల్లించకుండా తాత్కాలికంగా నిలిపివేశామే తప్ప, అవి చెల్లలేదనడం భావ్యం కాదని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణ డబ్బున్న రాష్ట్రమని చెప్పుకునే కేసీఆర్, చెక్కులు బౌన్స్ కావడంపై ఏమంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మల్లన్న సాగర్ ప్రాంతం నేత బెల్లయ్య నాయక్ ప్రశ్నించారు. ఓ వైపు వివిధ పథకాలకు నిధులను ఆపవద్దని కేసీఆర్ చెబుతున్న వేళ, చెక్కు బౌన్సుల వ్యవహారం తెరపైకి రావడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒత్తిడిని తట్టుకోలేక అధిక మాత్రలు తీసుకుంది : కల్పన కుమార్తె (Video)

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ

కుమార్తెతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సింగర్ కల్పన!

మిల్క్ బ్యూటీ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఏంటది?

నిద్రమాత్రలు మింగిన గాయని కల్పన ఆరోగ్యం ఎలావుంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

వేసవిలో చెరుకురసం ఎందుకు తాగాలో తెలుసా?

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

తర్వాతి కథనం
Show comments