తెలంగాణలో పెచ్చరిల్లిపోతున్న కరోనా కేసులు

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (11:01 IST)
తెలంగాణ కరోనా కేసులు పెచ్చరిల్లిపోతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మృతి చెందగా.. మొత్తంగా 637 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం తెలంగాణలో 22,528 యాక్టివ్ కేసులున్నాయి. 57,586 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణలో 6,24,840 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ 389, రంగారెడ్డి 86, సంగారెడ్డి 84, కరీంనగర్‌ 73 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు తెలంగాణలో అధికారంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్‌లో చోటుచేసుకున్న పెను అగ్నిప్రమాదం అనంతరం కీలక నిర్ణయాలను తీసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించడానికి తెలంగాణలో కూడా పెద్ద సంఖ్యలో కోవిడ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. 
 
కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ఇతర భవన సముదాయాల్లో వాటిని ఏర్పాటు చేశారు. వేలమంది కరోనా వైరస్ పేషెంట్లు వాటిల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 22 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోలీవుడ్ హీరో విజయ్ విడాకుల కేసు : జూన్ 15కు వాయిదా వేసిన కోర్టు

Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి ల వారణాసి షూటింగ్ కు బ్రేక్ కు కారణం అదే !

Dhanush: ఒకప్పుటి బ్యాంకు దొంగ - కనికరం లేని పోలీస్ అధికారి కథే ధనుష్... కారా ట్రైలర్

మహావతార్ పరశురామ్ ఎవరనేది సస్పెన్స్ తో టైటిల్, గ్లింప్స్ రిలీజ్

రామాయణంపై నా మాటలను వక్రీకరించారు : ప్రకాష్ రాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

విక్టోరియా సీక్రెట్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తృప్తి దిమ్రీని ప్రకటించిన అప్పారెల్ గ్రూప్

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments