Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డ సీనియర్ కాంగ్రెస్ నాయకులు

రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు.

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (17:40 IST)
రాహుల్ గాంధీ తెలంగాణాలో జరిపిన రెండు రోజుల పర్యటన కాంగ్రెస్ క్యాడర్‌కు ఉత్సాహాన్ని నింపింది. అయితే కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం రాహుల్ టూర్లో ఇబ్బంది పడ్డట్టు సమాచారం. హోటల్ హరిత ప్లాజాలో రాహుల్‌తో ఎడిటర్స్ సమావేశం ఏర్పాటు చేశారు. 
 
ఈ సందర్భంగా కొంతమంది పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే పత్రికలు టీవీ చానెల్స్ ప్రతినిధులు, ఫార్టీనాయకుల పేర్లను పిసిసి ఎస్పీజీ పంపించింది. అయితే ఎస్పీజీకి పంపిన జాబితాలో జానారెడ్డి, షబ్బీర్ ఆలీ పేర్లు లేకపోవడంతో అలిగి ఇద్దరూ ప్లాజా నుంచి బయటికి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు.
 
ఇది గమనించిన మరో నేత ఇద్దరినీ బతిమాలి లోపలికి తీసుకొచ్చి కూర్చో పెట్టారు. లోపల కూడా వాళ్లిద్దరూ మౌనంగానే కూచున్నారు. మరోవైపు రాహుల్ గాంధీతో సీనియర్ల మీటింగ్ జరిగే సమయంలో రేవంత్ రెడ్డి లోపలికి వెళ్లకుండా అనుమతి నిరాకరించారు. ఇక రాహుల్‌తో సీనియర్ల మీటింగ్‌కు తనకు కూడా అనుమతి లేదనడంతో సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments