Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2022 (12:35 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషినల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ఈమెకు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు అధికంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో ఆస్పత్రిలోనే గైనకాలజిస్టు వైద్యులు డాక్టర్ శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్యలు కలిసి సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువు బరువు 3 కేజీల 400 గ్రాములుగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ సంజీవయ్య తెలిపారు. 
 
జిల్లా కలెక్టరుగా భవ్యేష్ మిశ్రా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు, వాటి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే వున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రులపై సాధారణ ప్రజల్లో భరోసా, నమ్మకం కలిగించేందుకు వీలుగా తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే డెలివరీ చేయించి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments