Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5.59 కోట్లతో శ్రీవారికి ఆభరణాలు.. తిరుమలకు తొలిసారిగా తెలంగాణ సీఎం హోదాలో కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2010లో శ్రీవారికి మొక్కుకున్న కేసీఆర్ తన మొక్కు తీర్చుకోబోతున్నారు. రూ.5.59 కోట్లతో శ్రీవారికి సాలగ్రామహారం, పేటల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూరులో 19 కిలోల

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (13:00 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2010లో శ్రీవారికి మొక్కుకున్న కేసీఆర్ తన మొక్కు తీర్చుకోబోతున్నారు. రూ.5.59 కోట్లతో శ్రీవారికి సాలగ్రామహారం, పేటల కంఠాభరణం ఇవ్వబోతున్నారు. ఈ నగల్ని కోయంబత్తూరులో 19 కిలోల బంగారంతో చేయించారు. ఆభరణాల తయారీ బాధ్యతను టీటీడీకి తెలంగాణ సర్కారు అప్పగించింది. కీర్తిలాల్‌కాళిదాస్‌ కంపెనీ ఈ టెండర్లు దక్కించుకుని ఆభరణాలు తయారు చేసింది. 
 
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉమ్మడి రాష్ట్రంలోని తిరుపతి, కనకదుర్గమ్మ దేవాలయంతో పాటు ఇతర దేవుళ్లు దేవతలకు ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ అప్పట్లో తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని దేవుళ్లు, దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
 
ఈ నెలాఖరు (30)న తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. బంగారం రూపంలో మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం అటు నుంచే విజయవాడలోని కనక దుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments