Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కసరత్తు : 24న టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

Webdunia
బుధవారం, 22 అక్టోబరు 2014 (09:12 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటివరకు పలు దఫాలుగా అధికారులతో ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షా సమావేశాలు జరిపిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు, కీలకమైన బడ్జెట్‌ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాల తేదీల ఖరారుకు సన్నాహాలు ప్రారంభించారు. 
 
వచ్చే ఐదేళ్లలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమానికి ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు పునాదిగా సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ మేరకు అసెంబ్లీ తొలి బడ్జెట్‌ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనూ సిద్ధం చేసే పనికి సీఎం కేసీఆర్‌ పూనుకున్నారు. 
 
ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈనెల 24న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే, జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి బడ్జెట్‌కు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వారి ప్రాధాన్యతలు, ఆయా జిల్లాల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments