బ్యాంకు పనివేళల్లో మార్పులు..

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (12:42 IST)
తెలంగాణలో నిన్నమొన్నటి వరకు కరోనా లాక్ డౌన్‌తో మధ్యాహ్నం వరకే బ్యాంకులు పనిచేశాయి. అయితే గురువారం నుంచి బ్యాంకు పని వేళలు యథావిధిగా కొనసాగుతాయని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో గతంలో మాదిరిగానే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతాయని పేర్కొంది.
 
మంగళవారం కేబినెట్‌లో లాక్‌డౌన్‌ను ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పొడగించడంతో పాటు సడలింపు సమయం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు పెంచిన విషయం తెలిసిందే. మేలో లాక్‌డౌన్‌ అమలు చేసిన నాటి నుంచి బ్యాంకు పని వేళలు మారాయి. లాక్‌డౌన్‌ ప్రారంభంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు, జూన్‌ ఒకటో తోదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు సేవలందించాయి.
 
అయితే ఈ నెల 10 నుంచి లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో సాధారణ సమయాల్లోనే బ్యాంకింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొంది. బ్యాంకింగ్‌ సమయ వేళలను ఖాతాదారులు గమనించాలని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది. సాయంత్రం వరకు బ్యాంకులు పనిచేస్తాయని ఖాతాదారులకు బ్యాంకు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments