Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ : మంత్రి పోచారం

Webdunia
సోమవారం, 28 జులై 2014 (10:17 IST)
తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ళ తర్వాత వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తామని ఆ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 20 లక్షల పంపుసెట్లు ఉండగా... ఆంధ్రప్రదేశ్ లో 12 లక్షల పంపుసెట్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.
 
అయినా, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ సీమాంధ్రలో ఏర్పాటు చేసుకున్నారన్నారు. సీమాంధ్రుల పాలనలో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉంటేనే పంటలు పండుతాయని... లేకపోతే రైతన్నలు ఆకలితో అలమటించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ప్రారంభించారని చెప్పారు. మరో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వం పనులను ప్రారంభించిందని తెలిపారు. రానున్న మూడేళ్లలో రైతులకు 24 గంటలూ ఉచిత విద్యుత్ అందిస్తామని... ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. 

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments