Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 10 కిలోల బియ్యం

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:30 IST)
తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారందరికీ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. కరోనా కష్టకాలంలో ఆదుకున్నందుకు మరోసారి సర్కార్ సిద్ధమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి ప్రజలంతా కష్టాల్లోకి వెళ్లిపోతున్నారు. కొందరికి ఉపాధి లేకుండా పోయింది. మరికొందరు పని ఉన్నా కూడా కరోనా భయంతో బయటకు రాలేని పరిస్థితి. 
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న రేషన్‌ బియ్యం కోటా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఇస్తున్న ఐదు కిలోల బియ్యంతో కలిపి రేషన్‌ కార్డు ఉన్న కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మే నెల కోటా బియ్యం ఇవ్వనుంది. 
 
ఈ మేరకు వచ్చే నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. జూన్‌ నెలలో కూడా ఇదే విధంగా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 82.50 లక్షల రేషన్‌ కార్డుదారులకు 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments