Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ మీద సభా హక్కుల నోటీసు... రేవంత్ రెడ్డి హెచ్చరిక

Webdunia
బుధవారం, 12 నవంబరు 2014 (12:57 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యల మీద స్పీకర్‌కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. తమను ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ ఎమ్మెల్యేలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ మీద సభాపతి చర్యలు తీసుకోకపోతే సభాపతి మీద అవిశ్వాస తీర్మానం పెడతామని ఆయన హెచ్చరించారు. 
 
తండ్రి కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ కూడా నిరంతరం అబద్ధాలు చెబుతున్నారని, సభ సజావుగా సాగనివ్వకుండా టీఆర్ఎస్ సభ్యులు గందరగోళం స‌ృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హెరిటేజ్ సంస్థ పాలను కేరళ రాష్ట్రం నిషేధించిందని టీఆర్ఎస్ సభ్యుడు రవీందర్‌ రెడ్డి అనడం ఆయన అవగాహనా లేమికి అద్దం పడుతోందన్నారు. 
 
కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాల మీద విధించిన నిషేధాన్ని తన తప్పు తెలుసుకుని తొలగించిన విషయం టీఆర్ఎస్ సభ్యులకు తెలియక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 10 కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments