Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌లో చేరనున్న టీడీపీ నేత తలసాని శ్రీనివాస్!

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (10:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి బలమైన నేతగా గుర్తింపు కలిగిన బీసీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంత పార్టీని వీడి అధికార టీఆర్ఎస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా ఆయన సోమవారం టీ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కాగా, గత కొంత కాలంగా తలసాని పార్టీ మారతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తలసాని టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, పార్టీ నేతలతో అంటీ ముట్టనట్టు ఉండడం ఊహాగానాలకు ఊపిరి పోసింది. 
 
ఇదిలావుంటే, హైదరాబాదులోని పద్మారావునగర్ డివిజన్‌లో ఐడీహెచ్ కాలనీలో ఇళ్లు శిధిలావస్థకు చేరి వర్షాలకు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. వీరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తలసాని టీఆర్ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైందని టీఆర్ఎస్ నేతలు పేర్కొంటుండగా, ఆయనకు పార్టీ మారే ఆలోచన లేదని, నియోజకవర్గ ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయన కలుస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments