జైలుశిక్ష కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు నోటీసులు

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (12:24 IST)
ఓ పరిశ్రమపై దాడి కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కింది కోర్టు విధించిన జైలు శిక్ష వ్యవహారంలో సుప్రీంకోర్టు నోటీసు జారీచేసింది. గత 2014లో ఓ పరిశ్రమపై దాడి కేసులో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి జిల్లా కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పును ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు పంపించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిక్కుల్లోపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
కాగా, గతంలో పటాన్‌చెరు సమీపంలోని ఓ పరిశ్రమపై దాడి చేసిన కేసులో మహిపాల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు రెండున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 2500 రూపాయల అపరాధం కూడా విధించింది. ఈ తీర్పుపై మహిపాల్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేయగా, స్టే విధించింది. అప్పటి నుంచి ఈ కేసులో స్టే కొనసాగుతూనేవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments