Webdunia - Bharat's app for daily news and videos

Install App

జన్మనిచ్చిన తల్లినే చంపేశాడు.. మంచానికే పరిమితమైందని.. తలబద్ధలు కొట్టి..!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (10:40 IST)
జన్మనిచ్చిన తల్లికి కన్నకొడుకే కాలయముడయ్యాడు. చివరివరకు కాపాడి పోషిస్తాడనుకుంటే తలబద్దలు కొట్టాడు. వయసుపైబడి అనారోగ్యంపాలైన తల్లిని ఘోరంగా హత్యచేశాడు. గోడకేసి బాది తలబద్దలు కొట్టడంతో ఆమె మరణించింది. అయితే మంచం కిందపడి మరణించిందని అందరిని నమ్మించాడు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 2 దోభిఘాట్‌కు చెందిన రాణిబాయికి కరణ్‌సింగ్ అనే కుమారుడున్నాడు‌. 
 
రాణిబాయి ఎంతో కష్టపడి కుమారుడిని పెంచి పెద్ద చేసింది. రాణబాయి అనారోగ్య సమస్యతో మంచం ఎక్కింది. అప్పట్నుంచి కరణ్‌సింగ్‌ ఆమె పట్ల కఠినంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇటీవల అనారోగ్యం ఎక్కువై మంచం పైనుంచి లేవలేని స్థితికి చేరుకుంది. మలమూత్రాలు ఇంట్లోనే విసర్జించడంతో ఆగ్రహానికి గురైన కరణ్‌సింగ్‌ రెండు రోజుల ముందు ఆమెను కింద పడేసి తలను గోడకేసి బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రాణిబాయి అక్కడికక్కడే మృతువాత పడ్డారు.
 
ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు కరణ్ సింగ్ కుట్రపన్నాడు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాడు. అనారోగ్యంతో బాదపడుతున్నతల్లి మంచంలో నుంచి కిందకు దిగుతుండగా పడిపోయి మరణించిందని అందరిని నమ్మించాడు ఈ కసాయి. అనంతరం బుధవారం అంత్యక్రియలు పూర్తిచేశాడు. అయితే అంత్యక్రియల సందర్భంగా కరణ్‌ ప్రవర్తనపై రాణిబాయి సోదరుడు రణబీర్‌సింగ్‌కు అనుమానం వచ్చింది. 
 
దీంతో ఆయన బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరణ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తే తానే హత్య చేసిన్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments