Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనేటి టవర్స్‌లో వ్యభిచారం.. ఆరుగురు అరెస్ట్

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (10:46 IST)
అమీర్ పేట, ఓయో హోటల్‌ ప్రధాన కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తులను టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌ ద్వారా యువతులను తీసుకువచ్చి వివిధ చోట్ల వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బల్కంపేట ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని తేనేటి టవర్స్‌లో ఉన్న ఓయో రూమ్‌లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు సోదాలు చేశారు. 
 
ఈ సమయంలో హోటల్‌ వద్ద ఉన్న నిర్వాహకుడు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఉన్న కాచికూడకు చెందిన ఆడీటర్‌ వేణుకుమార్, ఓ యువతిని అరెస్టు చేశారు.
 
రమేష్‌ను విచారించగా తాను జనార్దన్‌ అనే వ్యక్తి వద్ద పని చేస్తానని చెప్పడంతో లీలానగర్‌లోని విద్యుత్‌ టవర్స్‌లో ప్రధాన నిర్వాహకుడు జనార్దన్‌ను అరెస్టు చేశారు. 
 
జనార్దన్‌ ఇచ్చిన సమాచారం మేరకు మరో నిర్వాహకుడు నాగుల్‌ మీరా, కో ఆర్టినేజర్‌ తిరుమల్‌రావుతో మరో నలుగురు విటులు, ఇద్దరు యువతులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments