Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాక్.. 16 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయిని పెళ్లాడింది 'ఒమన్' బిచ్చగాడు...

పాతబస్తీలో ఎంతో కాలంగా బాలికలను అక్రమంగా తరలించడం, పెళ్లి పేరుతో మోసం చేసి విదేశాలకు తీసుకెళ్లడం జరుగుతూనే వుంది. ఐతే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ వుండటంతో ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టినా అమ్మాయిల తల్లిదండ్రులు దొడ్డిదోవన మూడో కంటికి తెలియకుండా చేస్త

Webdunia
శుక్రవారం, 18 ఆగస్టు 2017 (19:31 IST)
పాతబస్తీలో ఎంతో కాలంగా బాలికలను అక్రమంగా తరలించడం, పెళ్లి పేరుతో మోసం చేసి విదేశాలకు తీసుకెళ్లడం జరుగుతూనే వుంది. ఐతే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ వుండటంతో ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టినా అమ్మాయిల తల్లిదండ్రులు దొడ్డిదోవన మూడో కంటికి తెలియకుండా చేస్తున్న పనుల వల్ల అభంశుభం తెలియని బాలికలు అన్యాయం అయిపోతున్నారు. 
 
ఇటీవలే అరబ్ షేక్‌నని చెప్పి 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన వ్యక్తి షేక్ కాదనీ, ఓ బిచ్చగాడని తమ విచారణలో తేలిందని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు. కాగా ఆ బాలికను కన్నతండ్రే అతడికి అప్పజెప్పాడనీ, పెళ్లి అఫిడవిట్లో బాలిక వయసును 21 ఏళ్లుగా చూపించి ఆమెను అతడికి కట్టబెట్టాడని తెలిపారు. 
 
కాగా బాలిక అక్రమంగా తరలింపుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మరో మహిళ పాత్ర కూడా వున్నదనీ, నాలుగైదు రోజుల్లో ఆమెను హైదరాబాదుకు రప్పించి మరిన్ని విషయాలు రాబడతామని తెలియజేశారు. మరోవైపు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయంపై చొరవ తీసుకుని బాలికను రప్పించే ప్రయత్నాలు చేస్తారని మేనకా గాంధీ తెలియజేసినట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments