Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో రైలుకు టీ సీఎం కేసీఆర్ అడ్డంకులు : షబ్బీర్ అలీ

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (13:39 IST)
మెట్రో రైల్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, అందువల్లే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు ఎదురవుతున్నాయని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరువల్లే మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ తప్పుకొంటామని చెబుతోందన్నారు. 
 
ఆయన తీరువల్లే రాష్ట్రానికి రావాల్సిన 'హీరో' మోటార్ సైకిళ్ల ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కు తరలిపోయిందని, తెలంగాణలోని మహేంద్ర ట్రాక్టర్ల యూనిట్ విద్యుత్ సమస్య కారణంగా బెంగళూరుకు తరలిపోయిందని అలీ గుర్తు చేశారు. రాబోయే మూడేళ్ల వరకూ కరెంట్ కష్టాలు తప్పవని కేసీఆర్ అంటున్నారని, కేవలం ఆయన నిర్లక్ష్య వైఖరి వల్లే పరిశ్రమలు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయని షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రాజెక్టులు ఏవీ తెలంగాణ రాష్ట్రానికి రాకుండా పోతున్నాయని, ఇలాగైతే తెలంగాణ అభివృద్ధి సాధ్యంకాదని ఆయన హెచ్చరించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments