Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కేటీఆర్ తో సౌదీ అరేబియా రాయబారి భేటి

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (06:57 IST)
భారతదేశంలో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహమ్మద్ అస్సతి, ఈరోజు ప్రగతిభవన్లో తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో పాటు మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె ఖాన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇక్కడ అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సౌదీరాయబారికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం టి ఎస్ ఐ పాస్ విధానం ద్వారా ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను తెలంగాణ  తెేవడంలో విజయం సాధించిందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఈ సందర్భంగా కేటిఆర్ కోరారు.

ఇందుకోసం అవసరమైతే  తెలంగాణలోని మౌళిక వసతులు, ఐటి, పరిశ్రమల వర్గాల ప్రతినిధులతో కలిసి సౌదిలో పర్యటిస్తామని, తద్వారా ఇక్కడకి సౌదీ పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నిస్తామని, ఇందుకోసం సహాకరించాలని రాయబారి సవూద్ ను మంత్రి కోరారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నది అని,  జీవించడానికి భారతదేశంలో ఉన్న అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నదని  మంత్రి కేటీఆర్ తెలిపారు. 
 
తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం పెద్ద ఎత్తున సౌదీకి ఇక్కడి పౌరులు వెళ్తారని, తెలంగాణకి సౌదీకి మధ్య సాంస్కృతిక సంబంధాలకు  మంచి చరిత్ర ఉన్నదని, ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలోహైదరాబాద్ నగరంలో సౌదీ  కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments