Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వం నుంచి శశికళకు నోటీసులు... నలిపేసిన శశి

శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (21:46 IST)
శశికళకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. నాలుగేళ్ళ జైలుశిక్ష అనుభవించేందుకు బెంగుళూరుకు శశికళ బయలుదేరే సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరో నోటీసు వచ్చింది. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్ పల్లి, రాధిక కాలనీలో శశికళ పేరిట ఒక ఇల్లు ఉండగా, ఆ ఇంటికి గత రెండేళ్ళ నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదు శశికళ. 
 
పన్ను బకాయిలను నూరు శాతం వసూలు చేయాలని సంకల్పించిన కెసీఆర్ సర్కార్ ఈ మేరకు శశికళ పేరిట నోటీసులు కూడా జారీ చేశారు. ఈ ఇంటిని 1990 ప్రాంతంలో శశికళ కొనుగోలు చేశారట. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కొంతకాలం జయలలిత ఇదే ఇంట్లోనే బస చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఆ తరువాత కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఈ ఇంటిని అద్దెకు ఇచ్చినప్పటి నుంచి వారు ఖాళీ చేసి వెళ్ళిన తరువాత గత నాలుగేళ్ళుగా ఈ ఇల్లు ఖాళీగానే ఉందని స్థానికులు చెబుతున్నారు.
 
శశికళ బెంగుళూరుకు బయలుదేరక ముందే ఆమెకు ఈ నోటీసులు అందాయట. దీంతో ఆమె మరింత ఆవేదన చెందుతూ ఆ నోటీసు నల్లిని నలిపినట్లు నలిపి అక్కడ పడేసి వెళ్లిపోయారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments