Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు?

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (19:37 IST)
తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని, అప్పుల్లో కూరుకుపోయిన డిస్కంలను ఆదుకునేందుకు ప్రజలపై భారం మోపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటికే బ్యాంకులు తీసుకున్న అప్పులను ఆర్టీసీ తీర్చలేక అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచుకునేందుకు ఈ రెండు సంస్థలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
వచ్చేవారంలో ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచింది.
 
ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలే ఒకవైపు పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలతో అల్లాడుతున్న ప్రజలు..ఇప్పుడు ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల భారంతో వాళ్లు మరింత ఇబ్బందుల పాలయ్యే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments