Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాంపల్లి అగ్ని ప్రమాదం: రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (10:58 IST)
నాంపల్లి అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అంతకుముందు ఘటనా స్థలాన్ని మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా అందజేస్తుందని ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగిన వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 
 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రంలోగా మృతుల కుటుంబాలకు పీఎం కేర్స్ సాయం అందజేస్తుందని పేర్కొన్నారు. నాంపల్లిలో జరిగిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. అగ్ని ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 
హైదరాబాద్ అన్ని రకాల ప్రమాదాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుంటే నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం బాధాకరమని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతుందా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

నాగ చైతన్య- శోభితా ధూళిపాళ వివాహం.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాపెంత?

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments