గల్ఫ్ లో అంతే! ప్రసవం బిల్లు రూ.5 కోట్లు (video)

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (07:05 IST)
గల్ఫ్ లో నెలలు నిండకుండానే ఆమెకు ప్రసవం కావడం.. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడంతో ఆస్పత్రి బిల్లు రూ.5కోట్లయింది. అంత బిల్లు తానెక్కడ చెల్లించేదంటూ ఆ భర్త లబోదిబోమంటున్నాడు.

బాధితుడు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని మల్లపల్లికి చెందిన సయ్యద్‌ జహీద్‌. అతడు కొంతకాలంగా సౌదీలో పనిచేస్తున్నాడు. విజిటింగ్‌ వీసాపై ఏడాది క్రితం భార్యను సౌదీకి తీసుకొచ్చాడు. అక్కడే ఆమె గర్భం దాల్చింది. ఏడోనెలలోనే నొప్పులు రావడంతో రియాద్‌లోని సులేమాన్‌ హబీబ్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ నలుగురు బిడ్డలకు ఆమె జన్మనిచ్చింది. ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటికే దాచుకున్న రూ.4.31లక్షలను జహీద్‌ చెల్లించాడు. పిల్లలు బరువు తక్కువగా ఉండటంతో ఇన్‌క్యూబెటర్లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు ప్రతి శిశువుకు రోజుకు 10వేల రియాళ్ల చొప్పున రోజుకు నలుగురు పిల్లలకు కలిపి రూ.7లక్షలు ఖర్చవుతోంది.

మరో రెండు నెలలయినా పిల్లలను ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌లో ఉంచి చికిత్స చేయాల్సి ఉందని.. ఆ రకంగా వారికి రూ.4.50 కోట్లు ఖర్చవుతుందని.. దీనికి మందుల ఖర్చు అదనమని వైద్యులు సూచించారు. పాపం.. జహీద్‌ అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక సాయం కోసం అర్థిస్తున్నాడు.

తన భార్య గర్భవతి అని తెలియగానే స్వదేశానికి పంపాలని అనుకున్నానని, అయితే ఎయిర్‌లైన్స్‌ అధికారులు అనుమతించలేదని.. దీంతో ఇక్కడే ఉంచాల్సి వచ్చిందని వాపోయాడు. ఇటీవల ఏడాది, రెండేళ్ల కోసం విజిటింగ్‌ వీసాలను సౌదీ ప్రభుత్వం ఉదారంగా జారీచేస్తోంది.

దీంతో ఈ వీసాల ద్వారా తెలుగు రాష్ట్రాల నుంచి పెళ్లయిన జంటల రాక పెరిగింది. ఈ క్రమంలోనే జహీద్‌ జంట ఇక్కడే కాపురం చేసి చిక్కుల్లో పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం