Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఢిల్లీకి రేవంత్.. రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ సభ్యత్వం

తెలంగాణ ఫైర్ బ్రాడ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇందుకోసం ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత మంగళవారం అంటే 31వ తేదీ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశమై మూడు రం

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2017 (10:34 IST)
తెలంగాణ ఫైర్ బ్రాడ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైపోయింది. ఇందుకోసం ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత మంగళవారం అంటే 31వ తేదీ మధ్యాహ్నం రాహుల్ గాంధీతో సమావేశమై మూడు రంగుల కండువాను కప్పుకోనున్నారు. 
 
ఇదిలావుండగా, రేవంత్‌రెడ్డి ఈ నెల 31న ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముందన్నారు. కాంగ్రెస్‌లో ఎవరు చేరినా స్వాగతిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఇప్పటికే రేవంత్‌ పేరిట ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో 30 గదులను ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు బుక్‌ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
మరోవైపు... రేవంత్‌రెడ్డి రాకను రాష్ట్ర నేతలెవరూ వ్యతిరేకించడంలేదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు. నవంబరులో రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటిస్తారని తెలిపారు. ఆ సమయంలో రేవంత్ నియోజకవర్గం కొడంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేలా రేవంత్ ప్లాన్ చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments