Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డికి బెయిల్ రద్దు చేయాలి : నేడు సుప్రీంకోర్టులో ఏసీబీ పిటీషన్?

Webdunia
గురువారం, 2 జులై 2015 (10:37 IST)
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడైన టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైదరాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలుచేయనుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్లు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ముఖ్యంగా.. నెల రోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉండి బుధవారం బెయిల్‌పై విడుదలైన రేవంత్ రెడ్డికి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, కేబినెట్ మంత్రులపై పరుష పదజాలంతో కూడిన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీసం మెలేశారు.
 
రేవంత్ రెడ్డి ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం ఆడియో కాపీలతో పాటు మీసం మెలేస్తూ రెచ్చగొట్టేలా వ్యవహరించిన వీడియో సీడీలతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు ఢిల్లీ చేరుకున్నారు. ఈ వీడియోలను సాక్ష్యంగా చూపించి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments