Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ కుటుంబీకులు భూకబ్జా దారులు.. రేవంత్ రెడ్డి ఫైర్

Webdunia
సోమవారం, 3 మే 2021 (19:19 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబీకులు భూకబ్జాలకు పాల్పడ్డారని దీనిపై సంపూర్ణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గమైన శామీర్ పేట మండలంలోని, దేవరయాంజల్ భూముల ఆక్రమణలపై సోమవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. నమస్తే తెలంగాణ పేపర్ ఎండీకి కూడా ఇక్కడ భూములు ఉన్నాయన్నారు. 
 
రామాలయం భూముల్లో కేసీఆర్, కేటీఆర్‌కు భూములున్నాయని తెలిపారు. దేవరయాంజాల్ భూముల్లో సేల్ డీడ్ కేటీఆర్ పేరు మీద ఉందని.. దేవుడి మాన్యాల్లో టీఆర్ఎస్ లీడర్లకు భూములు ఉన్నాయన్నారు. సర్వే నెంబర్ 658 మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకున్నారని.. 7 ఎకరాల్లో మంత్రి మల్లారెడ్డి ఫాంహోజ్ కట్టుకున్నారని చెప్పారు. రామాలయం గుడి మాన్యం కింద ఉన్న 1553 ఎకరాల్లో కేటీఆర్, దామోదర్ రావుకు భూమి ఉందన్నారు. 
 
సర్వే నెంబర్ 437లో ఉన్న అక్రమ నిర్మాణాల్లో కేసీఆర్‌కు వాటా ఉందని.. కేటీఆర్‌కు భూమి అమ్మిందెవరని ప్రశ్నించారు. ఈ అక్రమాలను గోల్ మాల్ చేయడానికే ధరణి వెబ్ సైట్ సృష్టించారన్నారు. ధరణిలో ఎవరి భూమి ఎవరికి అమ్మారనే వివరాలే ఉండవన్నారు. 
 
1925 నుంచి 2021 వరకు దేవరయంజల్ భూముల్లోని ప్రతి సర్వే నెంబర్ లావాదేవీలపై క్లారిటీ కావాలన్నారు. మీ నిజాయితీని ప్రజల ముందు పెట్టాలంటే దమ్ముంటే కేసీఆర్ గారూ మీరు దేవరయంజల్ భూముల వివరాలు వెల్లడించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments