Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకి పట్టిన శని కేసీఆర్ కుటుంబం : టీడీపీ నేత రేవంత్ ఫైర్

Webdunia
ఆదివారం, 26 అక్టోబరు 2014 (09:58 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత  కె చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్, ఆయన ఫ్యామిలీ అంటూ ధ్వజమెత్తారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ముందు అబద్ధాలు చెప్పడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం కేసీఆర్‌కు రివాజుగా మారిపోయిందన్నారు. 
 
తెలంగాణకు పట్టిన శనిగా కేసీఆర్ తయారయ్యారని ఆక్రోశించారు. కేసీఆర్ వక్రీకరించి, రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు ముందుచూపుతోనే రూ.1490 ఖర్చుతో 900 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశారని రేవంత్ గుర్తు చేశారు. సంయుక్తాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 
 
తెలంగాణలో ఎండిన పంటలకు, రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబేనని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాగినోడి మాదిరిగా కేసీఆర్ మాటలకు అర్థం లేకుండా పోయిందన్నారు. విద్యుత్ సమస్యలపై అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే సమష్టిగా అందరం కలిసి సాధించుకుందామని రేవంత్ పిలుపునిచ్చారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments