తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలి.. రాజన్న బిడ్డలు కాదు.. రేవంత్ రెడ్డి

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (18:37 IST)
వైఎస్ షర్మిల కొత్త పార్టీ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి.. షర్మిల కొత్త పార్టీ వెనుక ఉన్నది సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు కాబట్టి... కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు షర్మిలను రంగంలోకి దించారని విమర్శించారు. 
 
షర్మిల కేసీఆర్ వదిలిన బాణమని ధ్వజమెత్తారు. వైఎస్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజకమైన పాలన అందించారనే విషయం మర్చిపోవద్దని అన్నారు. 
 
అయినా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణ బిడ్డలు రాజ్యం ఏలాలని మాత్రమే అని... రాజన్నబిడ్డలు రాజ్యం ఏలాలని కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల అంశంపై షర్మిల వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments