Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో లాక్డౌన్ తప్పదా? సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష!

Webdunia
శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చేయిదాటిపోయేలా కనిపిస్తోంది. దీంతో మళ్లీ లాక్డౌన్ లేదా కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. 
 
ఆ తర్వాత కొన్ని సూచనలు చేశారు. ఈ సందర్భంగా సినిమా థియేటర్లలో సీటింగ్‌ కెపాసిటిని తగ్గించటం, బార్లను మూసివేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ శాఖ అధికారులు చెప్పినట్లు సమాచారం. 
 
ముఖ్యంగా, రాత్రి సమయాల్లో జనసంచారంపైనా నియంత్రణ అవసరమని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పత్రుల్లో కోవిడ్‌-19 పేషెంట్ల కోసం పడకలను పెంచాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. 
 
కేసులు పెరిగితే ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సమీక్ష సందర్భంగా సూచించారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లను రెట్టింపు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆక్సిజన్‌ వృథాను అరికట్టాలని సూచించారు. 
 
కాగా కరోనా లక్షణాలు తక్కువగా ఉన్న రోగులను చేర్చుకోవద్దని ఆస్పత్రులకు రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు మరో 1250 బెడ్లు కేటాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వరంగల్‌ ఎంజీఎంలో 150, నిజామాబాద్‌ జీజీహెచ్‌లో 250, మహబూబ్‌నగర్‌ జీజీహెచ్‌లో 150, నల్లగొండ జీజీహెచ్‌లో 150, సూర్యాపేట జీజీహెచ్‌లో 200, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 200, సూర్యాపేట జీజీహెచ్‌లో 200 అదనపు బెడ్లను కేటాయించారు. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో 9,281 కరోనా బెడ్లు ఉండగా, పెంపుతో ఆ సంఖ్య 10,531కి చేరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments