Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

హైదరాబాద్ నగరంలో మరో మూడేళ్ళ చిన్నారి అత్యాచారానికి గురైంది. ఈ దారుణం ఆ చిన్నారి ప్లే స్కూల్‌లోనే జరిగింది. ఆకతాయిల నుంచి కాపాడుకునేందుకు శిక్షణనివ్వాల్సిన కరాటే మాస్టరే... మూడేళ్ల చిన్నారిపై అత్యాచార

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (09:38 IST)
హైదరాబాద్ నగరంలో మరో మూడేళ్ళ చిన్నారి అత్యాచారానికి గురైంది. ఈ దారుణం ఆ చిన్నారి ప్లే స్కూల్‌లోనే జరిగింది. ఆకతాయిల నుంచి కాపాడుకునేందుకు శిక్షణనివ్వాల్సిన కరాటే మాస్టరే... మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్, కుషాయిగూడ నాగార్జుననగర్‌ కాలనీలోని ఐరిస్‌ ఫ్లోరెట్స్‌ ప్లే స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... కీసర మండలం నాగారానికి చెందిన దంపతులకు మూడేళ్ల పాప ఉంది. దంపతులిద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీంతో చిన్నారిని నాగార్జుననగర్‌ కాలనీలోని ఐరిస్‌ ఫ్లోరెట్స్‌ ప్లే స్కూల్‌లో చేర్పించారు. స్కూల్‌లో సాయికిరణ్‌ అనే కరాటే మాస్టర్‌ చిన్నారులకు కరాటేలో శిక్షణ ఇస్తుంటాడు. తమ పాప కూడా కరాటే నేర్చుకోవాలనే ఆశతో శిక్షణలో చేర్పించారు. 
 
ఈ నెల 7న రోజూ మాదిరిగానే ఆ చిన్నారిని తల్లిదండ్రులు ప్లేస్కూల్‌లో విడిచిపెట్టి వెళ్లారు. అదేరోజు చిన్నారిపై ఆ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన చిన్నారి జననాంగాల వద్ద నొప్పిగా ఉందంటూ ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పింది. సాధారణ నొప్పిగానే భావించినవారు పెద్దగా పట్టించుకోలేదు. 
 
తన వ్యధను తల్లిదండ్రులకు అర్థం అయ్యేలా ఎలా చెప్పాలో తెలియక.. వారం రోజులు ఆ చిన్నారి నరకయాతన అనుభవించింది. రోజూ నొప్పి అంటూ ఏడుస్తుండటంతో చివరకు ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. లైంగిక దాడి జరిగిందని చెప్పారు. తల్లిదండ్రులు అడగగా.. ప్లే స్కూల్‌లో కరాటే మాస్టర్‌ పేరు చెప్పింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం