Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామోజీ దృష్టి ఇపుడు రేడియోపై... మ‌యూరి ఎఫ్.ఎం. తెస్తారా?

విజ‌య‌వాడ‌: మీడియా మొగ‌ల్‌గా పేరొందిన రామోజీరావు దృష్టి ఇపుడు రేడియోపై ప‌డింది. ఈనాడు పేప‌ర్, ఈటీవీ మీడియా ఇప్ప‌టికే ప్ర‌సార మాధ్య‌మాల్ని ఏలేస్తున్నాయి. అటు న్యూస్, ఇటు ఎంట‌ర్‌టైన్మెంట్ రంగాల్ని ఊపేస్తున్నాయి. వీటి ద్వారా రామోజీ త‌న ప‌లుకుబ‌డిని ప్ర

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (19:54 IST)
విజ‌య‌వాడ‌:  మీడియా మొగ‌ల్‌గా పేరొందిన రామోజీరావు దృష్టి ఇపుడు రేడియోపై ప‌డింది. ఈనాడు పేప‌ర్, ఈటీవీ మీడియా ఇప్ప‌టికే ప్ర‌సార మాధ్య‌మాల్ని ఏలేస్తున్నాయి. అటు న్యూస్, ఇటు ఎంట‌ర్‌టైన్మెంట్ రంగాల్ని ఊపేస్తున్నాయి. వీటి ద్వారా రామోజీ త‌న ప‌లుకుబ‌డిని ప్ర‌భుత్వాలను క‌దిలించే స్థాయికి పెంచుకోగ‌లిగారు. ఇపుడు ఇక మిగిలిపోయింది రేడియో ఒక్క‌టే అనుకున్నారు కామోసు... దాన్ని కూడా చుట్టేయాల‌ని సంక‌ల్పించారు రామోజీ.
 
ఎఫ్.ఎం. రేడియోల‌కు దేశ‌వ్యాప్తంగా బిడ్డింగ్ జ‌ర‌ుగ‌నుంది. అందులో రామోజీ గ్రూపు కూడా పాల్గొంటోంది. రామోజీ దృష్టి అంతా ఇపుడు తెలుగు ఎఫ్.ఎం. కేంద్రాల‌పైనే ఉంది. ఈ బిడ్డింగుల్లో ముఖ్యంగా హైద‌రాబాద్ పైనే ఆయ‌న కేంద్రీకృతం చేస్తున్నార‌ట‌. హైద‌రాబాద్ ఎఫ్.ఎం. బిడ్ అత్యంత ఎక్కువ‌గా 18 కోట్ల రూపాయ‌లు ప‌లుకుతోంది. ఇవికాక విజ‌య‌వాడ‌లో రెండు, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరులో నాలుగేసి, రాజ‌మండ్రిలో 3, తిరుప‌తిలో రెండు ఎఫ్ ఎం. ల‌కు బిడ్లు ప్ర‌క‌టించారు. 
 
అటు తెలంగాణాలో హైద‌రాబాద్, ఇటు ఆంధ్రాలో విజ‌య‌వాడ‌, క‌ర్నూలు, కాకినాడ‌, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ఎఫ్.ఎం. బిడ్ల‌లో పాల్గొనేందుకు రామోజీ గ్రూపు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి మ‌యూరి ఎఫ్.ఎం. అని నామ‌క‌ర‌ణం చేస్తార‌ని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్ప‌టికే రామోజీకి మ‌యూరి ఫిలింస్, మ‌యూరి డిస్ట్రిబ్యూష‌న్ నెట్వ‌ర్క్ ఉంది. ఇపుడు ఎఫ్.ఎం. నెట్వ‌ర్క్ కూడా ఉంటే, ప్ర‌సార మాధ్య‌మాలు పూర్తిస్థాయిలో త‌మ గ్రిప్‌లో ఉంటాయ‌ని రామోజీ గ్రూపు భావిస్తోంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments