బుల్లి 'మగధీర' మరి లేడు... కామెర్ల వ్యాధితో కన్నుమూశాడు...
తెలంగాణ నేలపై, పొలాల్లో బాగా జుట్టు పెంచుకుని చిన్న బుడతడు ఒకడు మగధీర చిత్రం డైలాగులు చెప్పడాన్ని అంతా చూసే వుంటారు. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రాన్ని మూడుసార్లు చూశానని, ఆ చిత్రంలో డైలాగులు వల్లె వేస్తుంటే అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. విధి వక్
తెలంగాణ నేలపై, పొలాల్లో బాగా జుట్టు పెంచుకుని చిన్న బుడతడు ఒకడు మగధీర చిత్రం డైలాగులు చెప్పడాన్ని అంతా చూసే వుంటారు. రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రాన్ని మూడుసార్లు చూశానని, ఆ చిత్రంలో డైలాగులు వల్లె వేస్తుంటే అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. విధి వక్రించి ఆ బుల్లి మగధీర పరశురామ్ పచ్చకామెర్ల వ్యాధితో కన్నుమూశాడు.
ఆ బాలుడిని ప్రత్యేకంగా పిలిపించి అతడి డైలాగులు విని అతడిని అభినందించిన రాంచరణ్ ఈ వార్త విని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.
కాగా పరశురామ్ మహబూబ్ నగర్‌లోని అయిజ మండలానికి చెందినవాడు. అప్పట్లో మగధీర చిత్రం డైలాగులు చెప్పి పాపులర్ అయ్యాడు. రాంచరణ్ ఆ బాలుడికి బహుమతులు ఇవ్వడమే కాకుండా అతడిని పాఠశాలలో చేర్పించాడు. ఐతే అనుకోకుండా అతడు కామెర్ల వ్యాధికి బలయ్యాడు.