Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోతననగర్‌‌లో సారిక, అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు పూర్తి!

Webdunia
గురువారం, 5 నవంబరు 2015 (19:15 IST)
వరంగల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారులు అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌ల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. తన భర్త హింసించినా.. అత్తమామలు వేధించినా తన ముగ్గురు కుమారుల్ని అల్లారుముద్దుగా పెంచుకుని.. న్యాయం కోసం పోరాడుతూ వచ్చి.. మంటల్లో తన కుమారుల పాటే సజీవదహనమైన సారిక, ఆమె తనయులకు స్థానిక పోతననగర్‌లోని శ్మశాన వాటికలో సారిక తల్లి, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. 
 
శ్మశాన వాటిక వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భర్త వుండీ ఆకలితో ఎన్నోసార్లు అలమటించిన సారిక తన పుత్రులను కూడా తన వెంటే తీసుకెళ్లిపోయిందని.. ఆత్మహత్యకు పాల్పడే పిరికిది కాదని.. ఆమెను రాజయ్య కుటుంబీకులే చంపేశారంటూ.. సారిక తల్లి, అక్కయ్య అర్చన, బంధువులు అంటున్నారు. నిందితులకు సరైన శిక్ష పడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సారిక, కుమారులు ముగ్గురికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను ఆమె బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత గానీ సారికది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం తెలియరాదని పోలీసులు అంటున్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments