Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం - నేడు విద్యా సంస్థలకు సెలవు

Webdunia
మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (09:51 IST)
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే, ఏడు జిల్లాలకు రెడ్‌ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. 
 
రెడ్‌ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో హైదరాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిలు ఉండగా, జగిత్యాల, జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, ములుగు, నారాయణపేట, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, ఆదిలాబాద్‌, కుమురం భీం, జోగులాంబ గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. 
 
హైదరాబాద్ నగరంలో దంచి కొడుతున్న వర్షం ...  
 
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. దీంతో రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట్‌, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌ రోడ్‌, హస్తినాపురం, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, పారడైజ్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది. 
 
అనేక ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి పడుతూనే ఉంది. వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నేడు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments