Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృతుల కుటుంబాలకు జగన్ ఓదార్పు... బోరున విలపించిన కిషన్ రెడ్డి!

Webdunia
గురువారం, 24 జులై 2014 (14:39 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాద ఘటనాస్థలిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఘటనా స్థలిలో తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బోరున విలపించారు. 
 
ఈ ప్రమాదంలో డ్రైవరు, క్లీనర్‌తో సహా 20 మంది విద్యార్థులు మరణించిన విషయం తెల్సిందే. ఘటనా స్థలిలోనే 13 మంది మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఏడుగురు తుదిశ్వాస విడిచారు. మరో 15 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు విద్యార్థులు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. 
 
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద బస్సు ప్రమాదం జరిగిన స్థలాన్ని పలువురు నేతలు సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేక విలపించారు. కాసేపటి తర్వాత మృతుల తల్లిదండ్రులను, బంధువులను ఓదార్చారు. అనంతరం అక్కడే ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుతో మాట్లాడారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments