Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే సీనే లేదు.. రాహుల్ క్లారిటీ

Webdunia
శనివారం, 7 మే 2022 (17:45 IST)
Rahul Gandhi
టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణను దోచుకున్న వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదన్నారు. టీఆర్ఎస్-బీజేపీలతో లాలూచీ పడే నేతలు తమకొద్దన్నారు. 
 
టీఆర్ఎస్, కేసీఆర్‌తో పొత్తు, లోపాయికారీ ఒప్పందం పెట్టుకోవాలనుకునే నేతలు స్వచ్ఛందంగా పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే తాము మెడపట్టుకుని తోసేస్తామని గట్టి హెచ్చరిక చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీని ఓడించి తీరుతామని.. ఇది కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధమని పేర్కొన్నారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అండగా, వారి సమస్యలపై పోరాడే నేతలకే టిక్కెట్లు ఇస్తామని రాహుల్‌గాంధీ వరంగల్ సభ సందర్భంగా తేల్చి చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని.. వారి లాలూచీకి అదే నిదర్శనమన్నారు. 
 
తెలంగాణలో బీజేపీ గెలిచే దమ్ములేకే టీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటమే చేస్తుందని.. ఎవరితోనూ కలిసే ఉద్దేశం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments