Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (12:30 IST)
Rahul Gandhi
తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం సందర్శించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపం, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
 
ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్ గాంధీ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లిలోని అంబటిపల్లి గ్రామం వద్ద ఉన్న బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన ఇటీవల దెబ్బతిన్న బ్యారేజీని పరిశీలించారు. 
 
బ్యారేజీకి చెందిన కొన్ని పైర్లు మునిగిపోవడంతో కేంద్రం విచారణకు ఉన్నతస్థాయి బృందాన్ని పంపింది.  కుంగిపోయిన పిల్లర్లను పరిశీలించిన రాహుల్ గాంధీ బ్యారేజీని ఏరియల్ సర్వే చేశారు.
 
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఇతర నేతలు రాహుల్ గాంధీ వెంట ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నయనతారను పట్టించుకోని ఢిల్లీ జనం.. విఘ్నేశ్ వీడియో వైరల్

కార్తీక్‌ దండు దర్శకత్వంలో పర్వతంపై నిలబడ్డ నాగ చైతన్య 24 సినిమా పోస్టర్

స్టార్ లివర్ ఇన్‌స్టిట్యూట్ దేశం గర్వించే స్థాయికి ఎదుగుతుంది: ఎస్ఎస్ రాజ‌మౌళి

జానీ మాస్టర్‌కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సుప్రీం

నాగ చైతన్యకు పవర్ ప్యాక్డ్ పోస్టర్ తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తండేల్ బృందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments