Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వల్ల బాగుపడింది ఒక్క కుటుంబమే.. రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (20:05 IST)
తెలంగాణ రాష్ట్రం ఓ ఒక్కరి వల్ల రాలేదని.. ఎందరో త్యాగమూర్తుల త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందని వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కానీ తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు.  సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. 
 
తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము చెప్పేది కేవలం వట్టిమాటలు కావని, తెలంగాణ రైతుల ప్రగతి గురించి తామిచ్చిన మాటను కచ్ఛితంగా నిలబెడతామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బల్లగుద్ది చెప్పారు. 
 
వరంగల్ డిక్లరేషన్ ఇచ్చామని చెప్పిన రాహుల్.. రైతులకు 2 లక్షల రుణమాఫీ, అలాగే 15 వేల రూపాయల సాయం రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. ఇది డిక్లరేషన్ మాత్రమే కాదని, కాంగ్రెస్ రైతులకు ఇచ్చే గ్యారంటీ రాహుల్ అన్నారు. రైతుల మాట కేసీఆర్ వినడం లేదని.. మిర్చి, పత్తికి మద్ధతు ధర లభించడంలేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments