తెలంగాణలో ఈ నెల 6,7 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ హైదరాబాద్‌లోని పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. "రాహుల్ జీ ఆర్ యూ రెడీ ఫర్ వైట్ ఛాలెంజ్?" అని బ్యానర్లలో ప్రశ్నించారు.
ఇక బ్యానర్లలో ఇటీవల నేపాల్ రాజధాని ఖాఠ్మండ్‌లో ఓ మహిళతో పబ్‌లో కనిపించిన దృశ్యాలను పొందుపరిచారు. దమ్ముంటే డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉండాలని రాహుల్‌కు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు బయటకు వచ్చిన సమయంలో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి 2021 సెప్టెంబర్ 18న కేటీఆర్‌కు వైట్ ఛాలెంజ్ విసిరాడు. ఈ విషయమై గతేడాది సెప్టెంబర్ 20వ తేదీన కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.