Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక పసిపాప క్షేమం కోసం లక్షలాదిమంది ఆరాటం.. పాప బతికి రావాలని ప్రార్థనలు

ఒక పసిపాప క్షేమం కోసం లక్షలాది మంది ప్రజల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. మానవ ప్రయత్నం ఎంత తీవ్రంగా చేస్తున్నా ఆ పాపను బతికించాలంటూ వేలమంది ఆలయాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. బోరుబావిలో పాప అనుకోకుండా జారిపోయి 36 గంటలు దాటింది. మోటారుతోపాటు రావలిసిన పాప

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (02:12 IST)
ఒక పసిపాప క్షేమం కోసం లక్షలాది మంది ప్రజల హృదయాలు తల్లడిల్లుతున్నాయి. మానవ ప్రయత్నం ఎంత తీవ్రంగా చేస్తున్నా ఆ పాపను బతికించాలంటూ వేలమంది ఆలయాల్లో ప్రార్థనలు చేస్తున్నారు. బోరుబావిలో పాప అనుకోకుండా జారిపోయి 36 గంటలు దాటింది. మోటారుతోపాటు రావలిసిన పాప దురదృష్టవశాత్తూ పట్టు తప్పి 90 అడుగుల లోతుకు జారిపోవడంతో అందరి గుండెలవిసిపోయాయి. ప్రొక్లెయిన్ల సాయంతో బోరుకు రెండువైపుల నుంచి గుంత తవ్వి పాపను పైకి తేవాలని అధికారులు, సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప బతికి వుంటే, బతికి పైకి వస్తే ఎంత బాగుంటుందో.. బోరు బావిలో కదులుతున్న పాప చేయిని టీవీల్లో చూసిన కోట్లమంది జన హృదయాలు ఇప్పుడు మౌనంగా ఇదే ప్రార్థన చేస్తున్నాయి. 
 
చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామ పరిధి ఇక్కారెడ్డిగూడెంలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన 18నెలల ‘చిన్నారి’ని ప్రాణాలతో కాపాడేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా చర్యలు చేపట్టింది. ఎన్ని ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఫలించడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం బోరుబావికి సమాంతరంగా గోయి తీస్తుండగా వర్షం కురిసింది.   దీంతో కొంత సేపు అంతరాయం ఏర్పడినా పనులను కొనసాగించారు. మరోపక్క బోరుగుంతలో పడిన చిన్నారి క్షేమంగా బయట పడాలని వేలాదిమంది ప్రార్థనలు చేశారు.
 
బోరుబావిలో పడిన చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు  ఆధికార యంత్రాంగం, రెస్క్యుటీం బృందం  తీవ్రంగా కృషి చేస్తోంది. గురువారం రాత్రి 7 గంటల నుంచి నిర్విరామంగా సహాయక చర్యలు చేపట్టింది. బోరుబావి ఉన్న ప్రాంతం రాళ్లతో కూడి ఉండటంతో దానికి సమాంతరంగా గోయి తీసేందుకు జేసీబీలకు,  ఇటాచ్‌లను వినియోగించారు. నేల గట్టిగా ఉండటంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకునేందుకు గురువారం అర్థరాత్రి నుంచి గోయితీసే పనులు నిలిపి వేశారు. బోరుబావిలో సింగిల్‌ఫేజ్‌ మోటర్‌ ఉండడం వల్ల 40 అడుగుల లోతులోనే పాప చిక్కుకుంది. బోరుమోటర్‌ పైనే పాప ఉండటంతో మోటర్‌ను బయటకు తీస్తే పాపకూడా బయటకు వస్తుందని భావించారు. కానీ ఈ ప్రయత్నంలో బోరుమోటర్‌ మాత్రమే బయటకు వచ్చింది.
 
పాప అందులోనే ఉండిపోయింది. శుక్రవారం సాయంత్రం వరకు సాంకేతిక పరిజ్ఞాన  సేవలను  ఉపయోగించినా ఫలితం లేకపోవటంతో మళ్లీ సాయంత్రం నుంచి  సమాంతరంగా గోయి తీసే పనులు ప్రారంభించారు. ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. బోరుమోటర్‌ను బయటకు తీసిన తర్వాత ఇటాచీలతో తవ్వకాలు చేస్తున్న క్రమంలో పాప మరింత లోపలికి వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వర్షం పడటంతో సహాయక చర్యలకు కొంత అంతరాయం ఏర్పడినా చర్యలు కొనసాగుతున్నాయి.  పాపను ప్రాణాలతో బయటకు తీయడంలో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణంలో చిన్నారి బయటకు వస్తుందోనని అధికారులు,చిన్నారి తల్లిదండ్రులు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పాప కనిపించకుండా పోయి 24 గంటలు దాటడంతో మరింత ఉత్కంఠ నెలకొంది.
   
నల్లగొండ నుంచి వచ్చిన బృందం సభ్యులు ఇనుప రాడ్‌కు తాడుకట్టి బోరుబావిలోకి వదిలి చిన్నారి చేతులకు దానిని కట్టి పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో 40 అడుగుల లోపల ఉన్న చిన్నారిలో కదలికలు కనిపించాయి. ఏడుపు వినిపించింది. దీంతో  అధికారులు చిన్నారి తల్లి రేణుకతో పాపకు వినబడేలా ‘‘చిన్నారీ భయపడకు.. తాడు పట్టుకోమ్మా..’’ అంటూ చెప్పించారు. చిన్నారీ.. ఏడవకు అంటూ తల్లి చేస్తున్న సైగలతో లోపల ఉన్న చిన్నారి  రోదనలు బయటకు  వినిపించాయి. దీంతో పాప బతికే ఉందని సంకేతాలు అందుతున్నాయని.. పాప క్షేమంగా బయటకు వస్తుందని అందరూ ఆశగా ఉన్నారు. అయితే, చిన్నారి తాడును పట్టుకునేందుకు సహకరించకపోవడంతో  ఆ ప్రయత్నమూ ఫలించలేదు.
 
బోరుబావిలో 40 అడుగులనుంచి 90 అడుగుల లోతుకు పాప జారిపోయిందని తెలియగానే కన్న తల్లితో సహా బోరుబావి చుట్టూ ఉన్న వారి గుండెలవిసిపోయాయి. తెలంగాణ మంత్రి, కలెక్టర్, పోలీసు కమిషనర్, ఫైర్ అధికారులు, ఏసీపీలు, డీసీపీలు, ఆర్డీవోలు ఇలా డజన్ల కొద్ది అధికారులు గత 24 గంటలుగా బోరుబావి వద్దే ఉంటూ పాప క్షేమం కోసం ఆరాటపడుతూ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత ఆక్సిజన్ సరఫరా చేసినా అంత లోతుబావిలో చీకటి వాతావరణంలో పాప గుండె ధైర్యం చిక్కబట్టుకుని ప్రాణాలతో ఉండటం సాధ్యమేనా అంటూ అందరూ తల్లడిల్లుతున్నారు.
 
పాప నిజంగా బతికివస్తే  మానవ ప్రయత్నానికి చంద్రమండలానికి వెళ్లినంత అపూర్వ విజయం సిద్ధించినట్లే అవుతుంది. నీకోసం, నీ క్షేమంల కోసం, నీవు తిరిగి రావడం కోసం వేలాదిమంది, లక్షలాది మంది  పడుతున్న ఆరాటం ఫలించడానికైనా బతికి రావా పాపా..
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం