Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి తోటలో 14 యేళ్ల బాలికపై కన్నతండ్రి అత్యాచారం..

Webdunia
శనివారం, 17 జులై 2021 (10:07 IST)
ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని బలేశ్వరపురంలో 14 యేళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. పైగా, ఐదు నెలల గర్భవతి కూడా. ఈ దారుణానికి పాల్పడింది కూడా కన్నతండ్రే. మద్యానికి బానిస అయిన కన్నతండ్రి.. కట్టుకున్న భార్య సరుకుల కోసం దుకాణానికి వెళ్లినపుడంతా కుమర్తెను బెదిరించి మామిడితోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇలా ఏడు నెలలుగా శారీరక వాంఛ తీర్చుకోసాగాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భందాల్చడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌లో బాలిక ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, బాలేశ్వరపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (49)కి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరికి వివాహమైంది. 14 ఏళ్ల కుమార్తెతో కలిసి గ్రామానికి సమీపంలోని శింగరపల్లెలో మామిడి తోటలో కాపలాగా ఉంటున్నాడు. 
 
జనవరి నెలలో మామిడి తోట నుంచి గ్రామంలోకి సరుకుల కోసం భార్య వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఒంటరిగా ఉన్న తండ్రి కుమార్తెపై లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన తల్లికి కూతురు చెప్పినా.. బయటకు చెబితే చంపేస్తానని అతను బెదిరించడంతో భయపడిన భార్య, కుమార్తెలు నోరుమెదపకుండా ఉండిపోయారు. 
 
అప్పటి నుంచి కూతురిని శారీరకంగా అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో గలిజేరుగుళ్ల వైద్యశాలలో చూపించారు. బాలిక ఐదు నెలల గర్భిణిగా ఉందని కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పడంతో ఈ దారుణంవెలుగులోకి వచ్చింది. 
 
బాలిక అవ్వ, తాతలతో కలిసి బేస్తవారిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తండ్రి చేసిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు పెట్టేందుకు కూతురు వెళ్లిందనే సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇద్దరు సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ చేసి పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం