Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ ప్రోగ్రాంలో 'ఒరేయ్ నీ...' అంటూ బూతులు తిట్టుకొని, కొట్టుకోబోయిన పోసాని కృష్ణ మురళి - వి. హనుమంతరావు

సరిహద్దుల్లో సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఒక ప్రముఖ టివీ ఛానల్ (TV5)నిర్వహించిన చర్చా కార్యక్రమం రసాభాసగా మారి ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు కొట్టుకోబోయే దాగా వచ్చిం

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (15:20 IST)
సరిహద్దుల్లో సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఒక ప్రముఖ టివీ ఛానల్ (TV5)నిర్వహించిన చర్చా కార్యక్రమం రసాభాసగా మారి   ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు కొట్టుకోబోయే దాగా వచ్చింది. ఒక ప్రముఖ తెలుగు టీవి ఛానల్ వారు భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్‌ని గురించి ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పోసాని కృష్ణ మురళి, వి. హనుమంతరావు, సిపీఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 
చర్చ కొనసాగుతుండగా పోసాని కృష్ణ మురళి ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లులు కురిపించారు. పోసాని మాట్లాడుతుండగా వి.హనుమంతరావు కలుగజేసుకొని మోదీ గురించి మాకెందుకు, చర్చను ప్రక్కదారి పట్టిస్తున్నావంటూ కోపంగా అన్నారు. దీనికి పోసాని స్పందిస్తూ తాను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఎవరూ కల్పించుకోవద్దని, ఎవరైనా మాట్లాడుతుంటే తాను మాట్లాడనని, తాను చదువుకున్నవాడినని, పిచ్చి కుక్కని కాదని, తనకు ఓ పాలసీ ఉందని, తనకు మోదీ అంటే ఇష్టమని, అందుకని పొడుగుతానని,  నువ్వు ఎవడవు మాట్లాడవద్దని అనటానికి అంటూ ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. 
 
దీంతో వీహెచ్ మళ్లీ ఎవడ్రా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మోదీ అంటే అంత ఇష్టమైతే బయిట మాట్లాడుకో అని గట్టిగా ఒరేయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని తెలంగాణా యాసలో తమదైన తీరులో అరిచారు. సహనం కోల్పోయిన పోసాని 'లం...కొడుకా ..ఒరేయ్ నీ యమ్మ' అంటూ బూతులతో వీహెచ్ మీదకు వెళ్లారు. వీహెచ్ కూడా అంతే కోపంగా మీదకు వచ్చారు. ఈ లోగా స్టూడియో వాళ్లు ఎలర్టై, కెమెరాని ఆపి, వెళ్లి ఇద్దరినీ పట్టుకున్నారు. లైవ్ ఆపి పోసానికి నచ్చచెప్పి పంపించారు. తర్వాత యధాతధంగా లైవ్‌ని కొనసాగించారు. అయితే పోసాని మాట్లాడిన మాటలు అంతటా చర్చనీయాంశంగా మారాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments