Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబానికి హాని జరుగుతుందని సాయిబాబా చెప్పాడట.. ముంబై వెళ్లిపోయింది

తెలంగాణ పోలీసులను గత పది రోజులుగా ముప్పు తిప్పలు పెడుతున్న చిన్నారి పూర్ణిమ మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది కానీ మానసిక సమస్యల చరిత్రలేనే అతి పెద్ద చిక్కుసమస్యను ఈ ఉదంతం సమాజంపై విసిరింది. ఇది నిజమా అబద్ధమా అనే అనుమానాన్ని కూడా పటాపంచలు చేసేలా

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (08:24 IST)
తెలంగాణ పోలీసులను గత పది రోజులుగా ముప్పు తిప్పలు  పెడుతున్న చిన్నారి పూర్ణిమ మిస్సింగ్ కేసు ఎట్టకేలకు సుఖాంతమైంది కానీ మానసిక సమస్యల చరిత్రలేనే అతి పెద్ద చిక్కుసమస్యను ఈ ఉదంతం సమాజంపై విసిరింది. ఇది నిజమా అబద్ధమా అనే అనుమానాన్ని కూడా పటాపంచలు చేసేలా ఈ కేసు విషయంలో తేలుతున్న అంశాలు అటు పోలీసులను యిటు సగటు తల్లిదండ్రులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి.

తాను ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకు ప్రాణహాని అటూ వచ్చిన కలను నమ్మి తీవ్రమైన భయంతో ఇల్లు వదిలి ముంబై వెళ్లి పోయిన చిన్నారి పూర్ణిమ భయం సమాజానికి పెద్ద సవాలు. చివరకు ఆచూకీ దొరికిన తర్వాత కూడా అమ్మా నాన్నలను కలవడం కాదు కదా వారిని కనీసం చూసేందుకు కూడా ఇష్టపడని పూర్ణిమకు ఏ మానసిక వైద్యం మనోధైర్యాన్ని ఇస్తుందో అర్థం కావడం లేదు. 
 
 జూన్‌ 5న అంటే మిస్సింగ్‌కు రెండు రోజుల ముందు వచ్చిన కల పూర్ణిమను ఆగమాగం చేసింది. 5వ తేదీ తెల్లవారుజామున కలలో సాయిబాబా వచ్చి ‘నువ్వు మీ తల్లిదండ్రులతో ఉంటే వారికి ప్రాణహాని ఉంది. చెడు జరుగుతుంది. నా దగ్గరకు వచ్చేయి. లేదంటే నీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు. ఎవరికీ తెలియని ప్రదేశానికి రా’అంటూ వచ్చిన కల ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.

అదే రోజు పూర్ణిమ అమ్మకు కడుపునొప్పి రావడంతో దానిని చెడుకు తొలి సంకేతంగా భావించింది. మరుసటి రోజు చెల్లెలు తీవ్రమైన దగ్గుబారిన పడటంతో కుటుంబంలో ఇబ్బందులు మొదలయ్యాయని అనుకుంది. దీంతో జూన్‌ 7న ఉదయం ఇంట్లో రూ.వెయ్యి తీసుకుని స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి షిర్డీ వెళ్లే రైలు ఎక్కింది.
 
జూన్‌ 8న షిర్డీ సాయి దర్శనం చేసుకుని తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావొద్దని ప్రార్థించి.. జూన్‌ 9న ముంబైలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంది. అక్కడికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న బోయివాడ పోలీసుల వద్దకు వెళ్లిన పూర్ణిమ.. తన అసలుపేరు, ఊరు, తల్లిదండ్రుల పేరు చెబితే వారిని పిలిపించి తనను పంపిస్తారన్న భయంతో తాను అనాథనని అబద్ధం చెప్పింది. తన పేరు అనికశ్రీ అని, తల్లిదండ్రులు లేరని సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానంటూ వివరించింది. పోలీసులు ఆమెను డొంగ్రీలోని బాలసుదర్‌ గృహ్‌కు తరలించారు. 
 
ఎట్టకేలకు పూర్ణిమ ముంబైలో ఉందని తెలిసి ఆమె తల్లిదండ్రులతో పాటు వెళ్లిన తెలంగాణ పోలీసులకు షాక్ తగిలింది. తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి ముంబై వెళ్లగా.. వారిని కలిస్తే ఏమవుతుందోనన్న భయంతో పూర్ణిమ తల్లిదండ్రులను చూసేందుకు, కలిచేందుకు ససేమిరా అంది. మానసిక నిపుణులు కూడా ఆమె ఇష్ట్రపకారం మీరు కలవకండి అని చెప్పారని పోలీసులు తెలిపారు.  చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు, మానసిక నిపుణులు పూర్ణిమకు ఎంత చెప్పినా తల్లిదండ్రులతో వచ్చేందుకు ఆమె ఇష్టపడలేదు.

మంగళవారం సాయంత్రానికి ఆమెను హైదరాబాద్‌ తీసుకు రానున్నారు. జూన్‌ 7న నమోదైన మిస్సింగ్‌ కేసును కిడ్నాప్‌ కేసుగా మలచడంతో ఆ కేసు విషయంలో ఆమెను రంగారెడ్డి జిల్లాలోని జువెనైల్‌ కోర్టు ముందు హాజరుపరచను న్నారు. ఆ తర్వాత పూర్ణిమ ఇష్టపకారం తల్లిదండ్రుల వద్దకు వెళతానంటే పంపుతారు. లేదంటే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించి ఏదైనా హోంలో ఉంచే అవకాశం ఉంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకుడు శంకర్‌తో మా జర్నీ అలా మొదలైంది : నిర్మాత దిల్ రాజు

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments