Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ ఎన్నికల్లో పాగా వేసేందుకు పొన్నాల పాట్లు!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:50 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో పాగా వేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య దృష్టిసారించారు. ఇందులోభాగంగా గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆయన జీహెచ్ఎంసీ కాంగ్రెస్ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమావేశాల్లో కీలక నేతల మధ్య ఉన్న అనైక్యత పార్టీ ఓటమికి ప్రధాన కారణమైందని నేతలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ప్రధానంగా టీ-పీసీసీ చీఫ్ దృష్టి పెట్టారు. గ్రేటర్‌లో కాంగ్రెస్ నేతలందరినీ ఓకే మార్గంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలను మొదలు పెట్టారు. 
 
కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయామన్న విషయాన్ని గ్రహించిన ఆయన పార్టీ కోసం పని చేసిన నేతలకు గ్రేటర్ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసేందుకు ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. మరి గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాల అస్త్రాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments