Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీం కేసు.. త్వరలో రాజకీయ నేతలకు సిట్ నోటీసులు... అరెస్టులు తప్పవా?

గ్యాంగ్‌స్టర్ నయాం కేసును విచారిస్తున్న 'సిట్' పోలీసులు వేగం పెంచారు. గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ కేసులో నల్గొండ జిల్లాకు చెందిన పోలీసు అధికారితో పాటు రాజకీయ నేతను సిట్‌ అరెస్టు చేశారు. నయీం ఇంట్లో లభ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (13:54 IST)
గ్యాంగ్‌స్టర్ నయాం కేసును విచారిస్తున్న 'సిట్' పోలీసులు వేగం పెంచారు. గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ కేసులో నల్గొండ జిల్లాకు చెందిన పోలీసు అధికారితో పాటు రాజకీయ నేతను సిట్‌ అరెస్టు చేశారు. నయీం ఇంట్లో లభించిన డైరీ, సహచరులు, కుటుంబ సభ్యుల విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా నయీంకు సహకరించిన పోలీసు అధికారులు, నయీంతో లబ్దిపొందిన రాజకీయ నేతలు, వ్యాపారులపై సిట్‌ అధికారులు దృష్టి సారించారు. నయీంతో ఎవరెవరికి ఎటువంటి సంబంధాలున్నాయనే పక్కా ఆధారాలు దొరికిన నేపథ్యంలో కీలక అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. 
 
నయీం బాధితులు, ఐదువేల మందిపైనే ఉన్నారని, నయీం దురాగతాల్ని ప్రత్యక్షంగా అనుభవించిన ఐదుగురు ఎన్నారైలు ఈ-మెయిల్స్‌ ద్వారా సిట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు పలు ఆధారాలు కూడా అందజేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా నయీం సెటిల్‌మెంట్లు రూ.20 వేల కోట్ల పైనే ఉన్నాయని పోలీస్ వర్గాలు అంచనావేస్తున్నాయి. కాగా నయీంతో సంబంధాలున్న అధికార టీఆర్‌‌ఎస్‌తో పాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్న లెసెన్స్‌డ్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని సిట్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురు నాయకులకు నోటీసులు జారీచేశారని, కొందరు నేతల ఆయుధ లెసైన్సులు కూడా రద్దు చేసినట్లు తెలిసింది. 
 
నయీం కేసులో ఇప్పటి వరకు 95 మందిని అరెస్ట్ చేయగా, 8 మంది లొంగిపోయారు. 195 మందికి పిటీ వారెంట్లు జారీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సిట్ 72 మందిని అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు నాయకులకు నోటీసులు జారీ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ సునీత ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే..?

30 ఏళ్లకు తర్వాత భార్యకు విడాకులిచ్చిన ఏఆర్ రెహ్మాన్

చైనాలో 40వేల థియేటర్లలో విజయ్ సేతుపతి మహారాజ చిత్రం విడుదల

అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments