Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లు ఫ్రెండ్లీ పోలీసులట.. వీళ్లకంటే దున్నపోతులు నయం కాదా?

తెలంగాణలో రాజ్యవ్యవస్థ ఎంత క్రూరంగా, పాశవికంగా, భయానకంగా మారిందో.. అడ్డు ఆపూ లేకుండా జనంపై రాత్రింబవళ్లూ లాఠీలు ఎలా మోగుతున్నాయో.. 1980-90లనాటి నక్సలైట్ వ్యతిరేక నిర్బంధం కంటే మించిన నిర్బంధం తెలంగాణ ప్రజలపై ఎంత క్రూరంగా అమలువుతోందో ఈ వార్త చూస్తే చా

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (05:19 IST)
తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులట. మర్యాద రామన్నల్లో వీళ్లకు మించిన వారు లేరట. ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడతారట. పొరపాటున కూడా తప్పు మాటలు మాట్లాడరట. జనం ఒంటిమీద చేయి వేయరట. వెలమ దొర పాలనను రామరాజ్యంగా మారుస్తారు తప్పితే కండకావరాన్ని అస్సలు ప్రదర్శించరట. తెలంగాణలో రాజ్యవ్యవస్థ ఎంత క్రూరంగా, పాశవికంగా, భయానకంగా మారిందో.. అడ్డు ఆపూ లేకుండా జనంపై రాత్రింబవళ్లూ లాఠీలు ఎలా మోగుతున్నాయో.. 1980-90లనాటి నక్సలైట్ వ్యతిరేక నిర్బంధం కంటే మించిన నిర్బంధం తెలంగాణ ప్రజలపై ఎంత క్రూరంగా అమలువుతోందో ఈ వార్త చూస్తే చాలు పసిపాపలకు కూడా బోధపడుతుంది. 
వారు దళిత దంపతులు.. రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేం దుకు వెళ్లారు.. పిల్లలు మారాం చేస్తే వారినీ వెంట తీసుకెళ్లారు.. అంతా కలసి సొంత ఆటోలో పొలానికి చేరారు.. భర్త ఆటో దిగి మోటార్‌ స్టార్ట్‌ చేసేందుకు వెళ్లాడు.. ఇంతలో గస్తీ కాస్తున్న ఎస్సై అటుగా వచ్చాడు.. వాహనం ఆపి ‘ఇక్కడేం చేస్తున్నావ్‌..’అంటూ ఆమెను గద్దించాడు.. పొలానికి నీళ్ల కోసం వచ్చామంది.. అందుకు ఎస్సై.. ‘చాల్లే ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతు న్నావా..’అంటూ నానా దుర్భాషలాడాడు!
 
ఇంతలోనే అక్కడికి వచ్చిన ఆమె భర్త.. ఎస్సై ప్రవర్తనపై నిలదీశాడు. అంతే.. ఆ ఎస్సైకి ఎక్కడలేని కోపమొచ్చింది! నన్నే ప్రశ్నిస్తావా అంటూ ఆయన్ను చితకబాదాడు. భార్య కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. జీపులో వారిద్దరినీ తీసుకెళ్లి స్టేషన్‌లో పడేశాడు. అక్కడ మరో ఎస్సై.. ‘మాకే ఎదురుచెబుతావా..’అంటూ ఆయన్ను మళ్లీ తీవ్రంగా కొట్టాడు. అడ్డొచ్చిన ఆయన భార్యను నెట్టేయ డంతో ఆమె కింద పడి అస్వస్థతకు గురైంది. ఏ తప్పూ చేయకున్నా దంపతులపై పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు ఎస్సైలు సాగించిన దాష్టీకమిదీ!!
 
బాధితుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామానికి చెందిన అరికిల్ల మధునయ్యకు ధర్మారం ప్రధాన రోడ్డుకు రెండెకరాల భూమి ఉంది. అందులో వరి పంట వేశాడు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో పొలానికి నీళ్లు పెట్టి రావాల్సిందిగా మధునయ్య తన కొడుకు దేవేందర్‌కు చెప్పాడు. దీంతో ఆయన తన సొంత ఆటోలో పొలానికి బయల్దేరేందుకు సిద్ధమయ్యాడు. మేమూ వస్తామంటూ పిల్లలు అపర్ణ, సంపూర్ణ, బ్లెస్సీ మారాం చేశారు. పిల్లలతోపాటు దేవేందర్‌ భార్య శ్యామల కూడా బయల్దేరింది. అంతా కలసి పొలానికి వెళ్లారు. మోటార్‌ను స్టార్ట్‌ చేసేందుకు దేవేందర్‌ వెళ్లగా.. భార్యాపిల్లలు ఆటోలో కూర్చున్నారు. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ధర్మారం ఎస్సై హరిబాబు పోలీస్‌ వాహనం ఆపి.. ఇక్కడేం చేస్తున్నావంటూ శ్యామలను ప్రశ్నించాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వచ్చామని ఆమె చెప్పినా వినలేదు.
 
‘ఏదో కేసులా ఉన్నావు.. దుకాణం నడుపుతున్నావా..’అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అప్పుడే వచ్చిన దేవేందర్‌.. ఏం మాట్లాడున్నారంటూ ఎస్సైని నిలదీశాడు. దీంతో ఆగ్రహం చెందిన ఎస్సై అతడిని కొట్టాడు. ఈ సమయంలో ఎస్సై తన ఒంటిపై దుస్తులను కూడా చించాడని శ్యామల ఆరోపించింది. అనంతరం ఎస్సై వారిద్దరినీ పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనను స్థానిక ఎస్సై శ్రీనివాస్‌కు చెప్పాడు. ‘మాకే ఎదురుచెబుతావా..’అంటూ దేవేందర్‌ను శ్రీనివాస్‌ స్టేషన్‌లో మళ్లీ కొట్టారు. తన భర్త ఏ తప్పు చేయలేదని, స్టేషన్‌లో శ్యామల కేకలు వేయడంతో పోలీసులు ఆమెను నెట్టివేశారు. దీంతో కింద పడి ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపించారు.
 
ధర్మారం ఎస్సై హరిబాబుపై అనుచితంగా ప్రవర్తించిన దేవేందర్, శ్యామలపై కేసు నమోదు చేశామని పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ తెలిపా రు. దేవేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామన్నారు. ఏం చేస్తున్నారన్నందుకు ఎస్సైపై దౌర్జన్యం చేయడంతో వారిపై కేసు నమోదు చేశామని వివరించారు. శ్యామలను సోమవారం అరెస్టు చేస్తామన్నారు.
 
కాళ్లావేళ్లా పడ్డా.. కనికరించలేదయ్యా?
తన భర్తను కొట్టొద్దని ఎంత వేడుకున్నా ఎస్సై శ్రీనివాస్‌ కనికరించలేదని శ్యామల కన్నీటి పర్యంతమైంది. పోలీసుల దెబ్బలకు నడవలేకపోతున్నాడని తెలిపింది. ఆదివారం తన భర్తను చూపించాలని పోలీసులను కోరినా చూపించలేదని వివరించింది. పోలీసుల తీరుకు నిరసనగా బొంపల్లికి చెందిన దళిత మహిళలు, సీఐటీయూ నాయకులు, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ నాయకులు స్థానిక సివిల్‌ ఆస్పత్రి వద్ద రాస్తారోకో చేశారు. బసంత్‌నగర్‌ ఎస్సై విజయేందర్, పెద్దపల్లి ట్రాఫిక్‌ ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చేసిన 16 మందిపై కేసు నమోదు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. దళిత దంపతులపై అరాచకానికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి డిమాండ్‌ చేశారు.
 
వీళ్లు ఎస్సైలా జనం సొమ్ముతో బలిసిన దున్నపోతులా?
పెద్దపల్లి ఎస్సై శ్రీనివాస్‌ సాయం త్రం 7 గంటలు దాటితే రోడ్లపై యువకులు కనిపిస్తే చితకబాదుతున్నారని పలువురు బాధితులు ఇటీవల ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లిలోని కమాన్‌ ప్రాంతానికి చెందిన ఓ దళిత యువకుడు ఎస్సై కోచింగ్‌ కోసం మిత్రులతో కలసి చర్చిస్తుండగా.. రోడ్డుపై ఏం చేస్తున్నారంటూ లాఠీతో బాదారు. దీంతో ఆ యువకుడు పైఅధికారికి ఫిర్యాదు చేశాడు. మజీద్‌ చౌరస్తా వద్ద ఓ విద్యార్థి ఇంటి ముందు ఫోన్‌ మాట్లాడుతుంటే అకారణంగా కొట్టాడంటూ అతడి తండ్రి డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై హరిబాబు తన కారును సొంతానికి వాడుకుంటూ బెదిరిస్తున్నాడంటూ ధర్మారానికి చెందిన ఎల్లాల మహేందర్‌రెడ్డి ఐదు రోజుల క్రితం మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటుంటే ఎస్సైలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments