Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసు.. మరో నిందితుడి అరెస్ట్

Webdunia
మంగళవారం, 4 మే 2021 (11:13 IST)
సంచలనం సృష్టించిన హైదరాబాద్ కూకట్‌పల్లి ఏటీఎం కాల్పుల కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని కొద్ది రోజుల కిందటే అరెస్ట్ చేయగా.. రెండో వ్యక్తి పారిపోయాడు. 
 
కాల్పులకు పాల్పడిన గన్ పరారైన దోపిడి దొంగ వద్దే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు మొదటి నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా బీహార్‌లోని అతని గ్రామంలో నిఘా పెట్టారు. 
 
నిందితుడు స్వగ్రామం రాగానే అక్కడే అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన తుపాకి, ద్విచక్రవాహనం ఎక్కడి నుంచి వచ్చాయి. దోపిడీకి ఎవరైనా సహకరించారా..? అనే అంశాలపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు.
 
ఐదు రోజుల క్రితం కూకట్పల్లిలోని పటేల్కుంట పరిధిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం వద్ద ఇద్దరు ఆగంతుకులు ద్విచక్రవాహనంపై వచ్చి దోపిడీకి పాల్పడ్డారు. 
 
ఏటీఎంలో నగదు నింపుతున్న సిబ్బందిపై కాల్పులు జరిపి రూ.5లక్షలు ఎత్తుకు పోయారు. ఈ ఘటనలో ఏటీఎం వద్ద సెక్యురీటీగా పనిచేస్తున్న వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments