Webdunia - Bharat's app for daily news and videos

Install App

43 మంది అబ్బాయిలు. 21 మంది అమ్మాయిలు.. మస్తుమజాగా రేవ్ పార్టీ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (10:26 IST)
పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో మాత్రం రేవ్ పార్టీల నిర్వహణకు అడ్డుకట్టపడటం లేదు. తాజాగా, కరోనా వేళ హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వరుణ్ గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకోసం గ్రాండ్‌గా రేవ్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఇందులో పీకల వరకు తాగిన ఇంజనీర్లు అమ్మాయిలతో కలిసి చిందేశారు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ సమీపంలోని బాక్స్ కంటైనర్ ఫాంహౌస్‌లో శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలకు చెందిన 70 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు హాజరయ్యారు. అందరూ కలిసి మద్యం తాగుతూ, డీజే శబ్దాల్లో చిందులేస్తూ హోరెత్తించారు.
 
సమాచారం అందుకున్న కడ్తాల్ పోలీసులు రాత్రి 11.30 గంటల సమయంలో ఫాం హౌస్‌పై దాడి చేసి నిర్వాహకులతోపాటు మొత్తం 67 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు కాగా, మిగతా వారిలో 21 మంది యువతులు, 43 మంది యువకులు ఉన్నారు. 
 
పార్టీ ఏర్పాటు చేసిన వరుణ్ గౌడ్ పరారయ్యాడు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన యువతీయువకులను ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ పార్టీ వీడియోలు రేవ్ పార్టీకి మించిపోయి ఉండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments