భాగ్యనగరానికి మణిహారం.. హైదరాబాద్‌ మెట్రో

మరికొన్ని గంటల్లో హైదరాబాద్ మెట్రోరైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేస్తూ.. సగర్వంగా నగర ప్రజలకు అంకితం కానున్నది. మెట్రో రాకతో నగర ప్రజారవాణా వ్యవస

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2017 (09:33 IST)
మరికొన్ని గంటల్లో హైదరాబాద్ మెట్రోరైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీని భారతదేశానికి పరిచయం చేస్తూ.. సగర్వంగా నగర ప్రజలకు అంకితం కానున్నది. మెట్రో రాకతో నగర ప్రజారవాణా వ్యవస్థ మరో అంకానికి చేరనున్నది. 
 
ఈ సేవల ప్రారంభంతో భాగ్యనగరం వాసుల ట్రాఫిక్ కష్టాలు కొంతమేరకు తొలగనున్నాయి. హైదరాబాద్ నగర వాసుల చిరకాల కోర్కెల్లో ఒకటైన మెట్రో రైల్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. దేశంలో అతిపెద్ద పబ్లిక్‌ ప్రయివేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టుగా పట్టాలెక్కిన హైదారాబాద్‌ మెట్రోకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పచ్చజెండా ఊపనున్నారు. 
 
మూడు దశల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును దాదాపు రూ.14,100 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ మొత్తం ప్రాజెక్టులో ప్రధాన మంత్రి మియాపూర్ ‌- నాగోల్‌ మొదటి దశ ప్రయాణాలను మాత్రమే ప్రారంభించనున్నారు. 
 
మెట్రోరైలు ప్రారంభంతో నగర ప్రజారవాణా వ్యవస్థలో మరో మైలురాయి చేరనున్నది. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో.. ప్రపంచంలోనే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మితమైన అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డులు సృష్టించింది. ట్రావెలింగ్ విత్ షాపింగ్ థీమ్‌తో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని మిగల్చనున్నది.
 
మెట్రోరైలు సేవలు తొలత మూడు కోచ్‌లతో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత రద్దీని బట్టి వీటిని దాదాపు 6-9కి పెంచే ప్రణాళికలు ఉన్నాయి. ఒక్కో కోచ్‌లో దాదాపు 330 ప్రయాణించే అవకాశం ఉంది. ప్రయాణికులకు మేటి సేవలను అందించేందుకుగాను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఫీడర్‌ సర్వీస్‌ వ్యవస్థను అమలు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments