Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణికుడు.. బస్సులోనే మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:33 IST)
ఓ ప్రయాణికుడు గుండెపోటుతోనే బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్..  ప్రయాణికుడి మృతదేహాన్ని బస్సులోనే మృతుని ఇంటికి చేర్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో జరిగింది. 
 
తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 14వ తేదీన మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు వెళుతోంది. ఈ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో హుస్సేన్ అనే ప్రయాణికుడు మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. తోటి ప్రయాణికులను విచారించగా, హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెంగా చెప్పారు. 
 
ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్యలు ఉన్నతాధికారులకు చేరవేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెంకు తరలించారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుస్సేన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులంతా ప్రశసించారు. ఈ విషయం ఎండీ వీసీ సజ్జనార్‌కు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్‌లతో పాటు డిపో మేనేజరు విజయ్‌లను శనివారం బస్ భవన్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments