Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాస్ కోసం అమ్మాయికి ఐ ఫోన్ కొనిస్తే, అమ్మానాన్నలు బికేర్‌ఫుల్...

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (14:32 IST)
ఆన్‌లైన్ క్లాసుల కోసం మైనర్ బాలికకు సెల్ ఫోన్ ఇప్పించారు తల్లిదండ్రులు. అయితే ఆ బాలిక పేరెంట్స్‌కు తెలియకుండా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ యాప్‌లో ఇటీవలే ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఆ తరువాత వారితో ఫోటోలు దిగి టిక్‌టాక్ వీడియోలు చేసింది.
 
అయితే ఆ బాలికను యువకులు ముగ్గురు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేదంటే టిక్‌టాక్ వీడియోలు, ఫోటోలు వాట్సాప్‌లో పేరెంట్స్‌కు పంపిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో బాలిక వాడే ఐఫోన్ సైతం లాక్కున్నారు యువకులు.
 
తాము బైక్ కొనాలనుకుంటున్నామని అందుకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. చివరకు బాలిక మేనమామ ఈ విషయం పసిగట్టి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
ముగ్గురు యువకుల్లో ఒకరు బైక్ మెకానిక్ కాగా, మరొక యువకుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులతో పాటు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని, పిల్లలు వాడే  మొబైల్ ఫోన్లను చెక్ చేస్తూ ఉండాలని తల్లిదండ్రలకు పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments